భూములు అన్యాక్రంతం కాకుండా పరిరక్షిస్తామని ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..జిల్లాలోని వక్ఫ్ భూములను పరిరక్షించేందుకు కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నాలుగు చోట్ల సుమారు 20ఎకరాల్లో ఖబరస్తాన్‌లకు భూములు ఇచ్చామని, మసీదుల పునరుద్ధరణకు నిధులు, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. అబ్దుల్ ఖాదర్ దర్గాను ఆధునీకరించామన్నారు.
Mahabubnagar-Srinivaslands
0 Comments